పాములపాడు మండలం కల్లుకుంట గ్రామ దళిత మహిళలను నగ్నంగా విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టిన మానవ మృగాలను, వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీ జిల్లా కన్వీనర్ లింగాల స్వాములు మాదిగ, నవ్యాంధ్ర మాల మహానాడు అధ్యక్షుడు నల్లమల్ల. అబ్రహం తదితర ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్ చేశారు. పాములపాడు మండలంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.