నందికొట్కూరు: మద్యం దుకాణదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి
నూతన మద్యం దుకాణదారులు మద్యం విక్రయాలలో సమయపాలన పాటించాలని, ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, ప్రభుత్వ నిబంధనల మేరకే మద్యం దుకాణాలు నిర్వహణ కొనసాగాలని ప్రోహిబిషన్ ఎక్సేంజ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి అన్నారు. గురువారం నందికొట్కూరు పట్టణంలోని స్థానిక ఎక్సైజ్, ప్రొహిబిషన్ కార్యాలయాన్ని జిల్లా డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆకస్మిక తనిఖీ చేపట్టారు.