
నందికొట్కూరు: పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత
నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య సిఫార్సుతో సీఎం సహాయ నిధి ద్వారా పాములపాడు గ్రామానికి చెందిన గాండ్ల మహానంది లక్ష్మీదేవికి రూ. 6,20,800, లింగాల గ్రామం పూజల స్వాములకు రూ. 48,245, రుద్రవరం గ్రామం ఈడిగ నాగలింగన్నకు రూ. 3,04,484 మంజూరయ్యాయి. లబ్దిదారులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.