

నందికొట్కూరు: చలివేంద్రం ప్రారంభించిన జనసేన నాయకులు
నందికొట్కూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. కర్నూలు జనసేన పార్టీ మైనారిటీ నాయకులు హర్షద్ హిదయతుల్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, వేసవిలో తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.