నిత్యావసర ధరల నియంత్రణ చేతకాని మోది ప్రభుత్వ విధానాల వల్ల దేశ ప్రజలకు నష్టం జరుగుతుంది. సెప్టెంబర్ 6న నంద్యాల కలెక్టర్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండని భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపు నిచ్చింది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలని సెప్టెంబర్ 6న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు నంద్యాలలో బుధవారం పిలుపునిచ్చారు.