రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శనివారం కల్లూరు అర్బన 41వ వార్డు వీకర్సెక్షన కాలనీలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు.