ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమంత్రి వంగలపూడి అనితను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కలిశారు. గురువారం హోంమంత్రిని కలిసి మాట్లాడారు. పాణ్యం నియోజకవర్గంలోని పలు అంశాలను ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి హోంమంత్రితో చర్చించారు. శాంతిభద్రతలు, మహిళా రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ఆర్. యశ్వంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.