నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్మయ్య ఆదేశించారు. శుక్రవారం పత్తికొండ సర్కిల్ కార్యాలయంలో పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలతో క్రైం మీటింగ్ నిర్వహించారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. నేరస్తులపై కఠినంగా వ్యవహరించి శాంతి భద్రతలను అందించాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలన్నారు.