ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూలాపాల్ అన్నారు. శుక్రవారం వెల్దుర్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. పాఠశాలకు చేరుకున్న ఆయన విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ ఏడాది పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని హెచ్ఎం చంద్రావతికి సూచించారు.