అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు ఆదివారం ఆషాడ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని శాకంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాడమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తదితర వాటితో శాకంబరిదేవిగా అలంకరించారు. అదేవిధంగా అమ్మవారి ఆలయాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దారు. ఈవేడుకను పురస్కరించుకొని భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.