శ్రీశైలంలో కిక్కిరిసిన భక్తజనం

79చూసినవారు
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు దినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి తరలివచ్చారు. విచ్చేసిన భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. లడ్డు కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ కనిపించింది. భక్తుల రాకతో క్షేత్రంలో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్