ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను బుధవారం నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆ తదుపరి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా అర్చకులు స్వామి అమ్మవార్ల వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.