గోనెగండ్ల మండలంలో ఉన్నటువంటి జీనియస్ గ్లోబల్ పాఠశాలను సీజ్ చేయాలని విద్యార్థి సంఘం నాయకులు అన్నారు. గోనెగండ్ల లోని జీనియస్ గ్లోబల్ పాఠశాల ప్రభుత్వ నిబంధనకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని శనివారం పాఠశాల ముందు రోడ్డు పైన అరగంట పాటు రాస్తారోకో చేశారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ఫిట్నెస్ లేని బస్సులను, టాటా సుమో ఏర్పాటు చేసుకుని విద్యార్థులను అధిక సంఖ్యలో ఎక్కించుకొని పాఠశాలకు తీసుకెళ్తూన్నారని, కనీస సౌకర్యాలు కల్పించకుండా రేకుల షెడ్లలో తరగతులు నిర్వహిస్తున్నారని, పాఠశాల ప్రక్కనే పెట్రోల్ బంకు ఉందన్నారు. జీనియస్ గ్లోబల్ పాఠశాల పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేసి పాఠశాలను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేసారు.