ఎమ్మిగనూరు పట్టణం సోమప్ప సర్కిల్ నందు కూలిపోయిన మెయిన్ డ్రైనేజీ కల్వర్టుకు తక్షణమే మరమ్మత్తు పనులు చేపట్టాలని సిపిఎం పట్టణ నాయకులు గోవిందు, రాముడు డిమాండ్ చేశారు. కూలిపోయిన కల్వర్టును సోమవారం సిపిఎం బృందం పరిశీలించారు. కల్వర్టు కూలిపోయి 60రోజులు గడుస్తున్న. స్పందించాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు జరగరానిది జరిగితే, అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు.