ఢిల్లీలో రెండు రోజులుగా వాయు నాణ్యత దెబ్బతిందని సీఎం ఆతిశీ తెలిపారు. ఈ నేపథ్యంలో కీలక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. నిర్మాణ ప్రదేశాల్లో దుమ్ము నియంత్రణ చర్యలు పాటించేలా పర్యవేక్షించేందుకు 99 బృందాలను నియమించినట్టు స్పష్టం చేశారు. నిర్మాణాలు, కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు 150కి పైగా బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. దుమ్ము నియంత్రణ కోసం సమస్యాత్మక ప్రాంతాలు, రోడ్లలో 300కు పైగా స్మాగ్ గన్స్ మోహరిస్తామని వివరించారు.