అధికారుల తప్పుకు సారీ చెప్పిన నారా లోకేష్

527చూసినవారు
అధికారుల తప్పుకు సారీ చెప్పిన నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ తనదైన శైలిలో పనిచేస్తూ కనిపిస్తున్నారు. అంతేకాదు తనవైపు నుంచి తప్పుంటే ఎలాంటి భేషజాలు లేకుండా ఎదుటివారికి క్షమాపణలు చెప్పేందుకూ సిద్దమవుతున్నారు. ఏపీలో మురుగునీటి సమస్యపై ప్రజాదర్బార్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీన్ని లోకేష్ సదరు శాఖకు పంపారు. సమస్య పరిష్కారం కాకుండానే అయినట్లు అధికారులు ఫిర్యాదు దారుకు మెసేజ్ పంపేశారు.
ఇది తెలిసిన‌ లోకేశ్ స్పందించారు. సదరు శాఖ తరఫున ఫిర్యాదుదారుకు క్షమాపణలు చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్