AP: టమాటా ధర నేలచూపులు చూస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండలో టమాటా మార్కెట్‌లో కిలో టమాటా రూపాయి, రూపాయి పావలా కూడా పలకని పరిస్థితి. 25 కిలోలు ఉన్న టమాటా బాక్సు 30 నుంచి 40 రూపాయిల లోపే అమ్ముకోవాల్సి వస్తోంది. పంట ఉన్న ఈ పది రోజుల్లో కాస్త మంచి ధరకు అమ్ముకుందామంటే అతి తక్కువ ధర ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం టమాటా కోత కూలీలు, ఖర్చులు అయినా రావడం లేదని రైతులు వాపోతున్నారు.