విశాఖ సముద్ర తీరంలో నిర్వహిస్తున్న నావికాదళ విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో నిర్వహించిన నేవీ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ .. విశాఖకు ఎన్నోసార్లు వచ్చినా ఈ పర్యటన మాత్రం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నావికాదళానికి అభినందనలు తెలియజేశారు. వారి ధైర్యానికి హ్యాట్సాఫ్ అని చెప్పారు.