ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా" వారు 26-12-2024 వ తేదీన ప్రకటించిన సీఏ ఫైనల్ పరీక్షా ఫలితాలలో ప్రముఖ విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా మొదటి ర్యాంక్, 33వ ర్యాంక్, 34వ ర్యాంక్ మరియు 40వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించారు. ఈ విజయంతో మాస్టర్ మైండ్స్ విద్యాసంస్థ కామర్స్ కోర్సుల ఫలితాలలో మరోమారు తన నెం.1 స్థానాన్ని పదిలం చేసుకుందని మాస్టర్ మైండ్స్ క్యాంపస్ ఇన్ఛార్జ్ వై.శ్రీనివాసరావు తెలిపారు. ఈ యొక్క విజయోత్సవ బైక్ ర్యాలీని వై.ఎస్.ఆర్ గమరియు ఆంజనేయ విజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. జనవరి 4న మాస్టర్ మైండ్స్ అధ్యాపకేతర సిబ్బంది అందరూ కళాశాల ప్రాంగణం నుండి బైక్ ర్యాలీతో బయలుదేరి శంకర్‌విలాస్, లాడ్జి సెంటర్ మీదగా ర్యాలీ నిర్వహించి తిరిగి మరలా క్యాంపస్ కి చేరుకున్నారు. అంతే కాకుండా కళాశాల ముందు ఆనందోత్సహాలతో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ముఖ్యంగా ఇలాంటి విజయసాధనకు కారణభూతులైన అధ్యాపకులను,అధ్యాపకేతర సిబ్బందిని మరియు కష్టపడి చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులను మాస్టర్ మైండ్స్ యాజమాన్యం అభినందించారు.