చలికాలంలో నువ్వులు తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వులను తినడం వల్ల సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. దంతాలు బలపడతాయి. రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా వీటి వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ప్రమాదం దరిచేరదు. అయితే నువ్వులను అతిగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.