గ్లోబల్ వార్మింగ్, గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం సైకిల్ మీద భారతదేశాన్ని చుట్టేస్తున్న బెంగుళూరు విద్యార్థులు ధనుష్, హేమంత్ ల సైకిల్ యాత్ర నెల్లూరు నుంచి బాంబే రహదారి మీదకు చేరుకున్నారు. ఆత్మకూరు పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర వీరికి బిఎస్సార్ ఐటిఐ కళాశాల కరస్పాండెంట్ ప్రకాష్, ఐక్య ఫౌండేషన్ ఛైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి, కళాశాల బృందం, ఫౌండేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం వారికి శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పర్యావరణం, కోవిడ్ దృష్ట్యా అందరికీ అవగాహనా కల్పిస్తూ వీరు సైకిల్ మీద యాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, సుధీర్, సురేంద్ర, యశ్వంత్, పవన్, మల్లికార్జున, చరణ్, తదితరులు పాల్గొన్నారు.