ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధి లోని అల్లిపురం గ్రామానికి చెందిన శివరావమ్మా, జానమ్మ అనే ఇద్దరు వృద్ధులు జీవనం సాగిస్తున్నారు.
గత కొద్ది రోజులగా ఆ వృద్ధులకు ఆరోగ్య పరిస్థితి బాగా లేక తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్న విషయాన్ని ఐక్య ఫౌండేషన్ ప్రతినిధులు ఆ కుటుంబాల పరిస్థితిని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ ప్రణీత్ చౌదరి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సోమవారం ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడే నాణ్యమైన బియ్యం బస్తాలు, వంట సామాగ్రి, తినుబండారాలు, పండ్లు డాక్టర్ ప్రణీత్ చౌదరి చేతులమీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ ఆ కుటుంబ పరిస్థితిని ఐక్య ఫౌండేషన్ ద్వారా తెలుసుకున్నామని ఇద్దరి వృద్ధుల పరిస్థితిని చూడగానే తమ మనసును కలచి వేసిందని భవిష్యత్తులో ఈ కుటుంబాలకి తమ వంతుగా సహాయం అందజేస్తామని ఆయన అన్నారు.
అనంతరం రామకృష్ణచౌదరి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వృద్ధుల కుటుంబాల పరిస్థితిని డాక్టర్ ప్రణీత్ చౌదరి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మానవత్వంతో ఆదుకున్నారని సేవా కార్యక్రమాలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఆపద్బాంధవుడు డాక్టర్ ప్రణీత్ చౌదరి కి ఐక్య ఫౌండేషన్ తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండి డాక్టర్ ప్రణీత్ చౌదరి, ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి, డాక్టర్ కుమార్, చండ్ర శ్రీనివాసులు, అనిల్ యాదవ్, ముజాఫర్, యాసిన్ మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.