ఆత్మకూరు పట్టణంలోని జ్యోతి నగర్ కి చెందిన కర్ర నాగరాజు - పద్మ ఇద్దరు పిల్లలతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సంగం బీరా పేరు వాగు వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. ఆ ప్రమాదంలో ఇంటి పెద్ద దిక్కైన తల్లిదండ్రులు మరియు కుమార్తె గల్లంతయ్యారు. చివరికి ఆ కుటుంబంలో బాలుడు నవదీప్ మిగిలాడు. గల్లంతైన నవదీప్ తల్లిదండ్రులు తిరిగి వస్తారని పెట్టుకున్నా ఆశలు నిరాశఅయ్యాయి. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలిచి వేస్తుంది అలాగే బాలుడిని చూసిన ప్రతి ఒక్కరికి కన్నీరు పెట్టిస్తుంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఐక్య ఫౌండేషన్ చైర్మన్ పయ్యావుల రామకృష్ణచౌదరి ఆత్మకూరు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ ప్రణీత్ చౌదరి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి గురువారం ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమ వంతుగా 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హాస్పిటల్ చాంబర్లో అందించారు.
ఈ సందర్భంగా రామకృష్ణచౌదరి మాట్లాడుతూ డాక్టర్ ప్రణీత్ చౌదరి ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడిల నిలుస్తున్నారని అలాగే తమ సేవలు అమూల్యమైనవని, బాలుడికి ఆర్థిక సహాయం చేసినందుకు ఐక్య ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మనసున్న దాతలు స్పందించి బాలుడికి అండగా నిలవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది ఐక్య ఫౌండేషన్ సభ్యులు తదితరులు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.