నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లి మేకపాటి నివాసంలో దివంగత మంత్రి, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి వ
ైసీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కేక్ వైసిపి నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.