విద్యా వ్యవస్థ ను నిర్వీర్యం చేస్తూ, విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన
వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలు డిమాండ్ లతో మంగళవారం టిఎన్ఎస్ఎఫ్, ఏఐ ఎస్ఎఫ్ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గంలోని విద్యా సంస్థల(ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు) బంద్ ను రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు మారుతి నాయుడు, సుభాని, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.