ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 25న మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ఉన్న ఐసీఏఆర్ - కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి కన్హా శాంతివనంలో బస చేస్తారు. 26న ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. కాగా, ఉపరాష్ట్రపతి పర్యటనపై సీఎస్ శాంతికుమారి ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.