Feb 07, 2025, 02:02 IST/
డాక్టర్ సమరం ఇంట్లో విషాదం
Feb 07, 2025, 02:02 IST
AP: ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి, వైద్యురాలు మారు (80) అనారోగ్యంతో విజయవాడలోని ఆమె నివాసంలో కన్నుమూశారు. మారు గత 55 ఏళ్లుగా విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో వాసవ్య నర్సింగ్ హోమ్ ద్వారా వైద్య సేవలు అందించారు. మూఢ నమ్మకాల నిర్మూలనకు ఆమె కృషి చేశారు. ముఖ్యంగా తెలంగాణలోని కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజన మహిళలకు ప్రసవాలపై అవగాహన కల్పించారు.