హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రపంచంలో అత్యంత ధనికుడిగా 420 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ ప్రథమ స్థానంలో నిలిచారు. మరోవైపు, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత రోష్నీ నాడార్ ప్రపంచంలోనే 5వ అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందారు. ఇందులో భారతీయ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారు.