తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో డీలిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. జనాభా నియంత్రణ విజయవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోకూడదని, ఇది శాపంగా మారకూడదని ఆయన అన్నారు. లోక్‌సభ సీట్ల పునర్విభజనకు ముందు అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలని ప్రతిపాదించారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని, సీట్లు యథాతథంగా ఉంచాలని సూచించారు.