Mar 21, 2025, 16:03 IST/
ALERT: ఉరుములు, మెరుపులతో వడగళ్ల వానలు
Mar 21, 2025, 16:03 IST
తెలంగాణలో శనివారం, ఆదివారం పలుచోట్ల ఉరుములు మెరుపులు, వడగళ్లతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. ఆదివారం రోజున కొన్ని జిల్లాల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.