IRCTC కీలక నిర్ణయం.. ఇకపై రైళ్లలో క్లౌడ్‌ కిచెన్‌ సేవలు

71చూసినవారు
IRCTC కీలక నిర్ణయం.. ఇకపై రైళ్లలో క్లౌడ్‌ కిచెన్‌ సేవలు
రైల్వే ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా భారత రైల్వేశాఖ (IRCTC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో బేస్‌ కిచెన్లకు స్వస్తి చెబుతూ.. పూర్తిగా క్లౌడ్‌ కిచెన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్లౌడ్‌ కిచెన్ల వంట గదిలో సీసీటీవీ కూడా ఏర్పాటు చేస్తారు. తద్వారా ఆహార పరిశుభ్రతను నిశితంగా పరిశీలిస్తారు. అల్పాహారం, మధ్యాహ్నం సహా రాత్రి భోజనం వరకు రోజూ 1,000 నుంచి 4000 వరకు ప్యాకెట్లను ఈ కిచెన్లు సిద్ధం చేస్తాయి.

సంబంధిత పోస్ట్