ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనపై నిరసనలు కొనసాగిస్తున్న డాక్టర్లు నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. సీఎంతో సమావేశం కోరుతూ ఈ-మెయిల్ పంపాలని నిర్ణయించారు. రాష్ట్ర హెల్త్ సెక్రటేరియట్ 'స్వాస్థ్య భవన్' వెలువల జూనియర్ డాక్టర్లు నిరసనలు చేపట్టారు. సీఎంతో తాము మాట్లాడాలనుకుంటున్నట్టు తెలిపారు.