టమాటాల్లో క్యాన్సర్‌ను అరికట్టే గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. టమాటాలోని లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ పేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. టమాటాలు గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టమాటాలు తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్‌ను తగ్గిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. చర్మాన్ని అందంగా ఉంచుతుంది. ఎముకలు బలపడతాయి.