నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని వీరేపల్లి గ్రామంలో గల రైతు భరోసా కేంద్రంలో.. వ్యవసాయ అధికారి బి. తిరుమల జ్యోతి అధ్యక్షతన మంగళవారం పోలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ పథకాల గురించి అవగాహన కల్పించారు. పంటలు సాగుచేసే క్రమంలో తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులు గురించి వివరించారు. ప్రజలందరూ తప్పనిసరిగా నాణ్యమైన మందులనే వాడాలన్నారు. ముఖ్యంగా విత్తనాలు శుద్ధి చేయాలని తెలిపారు.