వలేటివారిపాలెం పట్టణం వడ్డెర కాలనీలో జరుగుతున్న శ్రీ సీతారామల ఉత్సవాలకు శనివారం కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామస్తులతో మాట్లాడారు గ్రామంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.