కందుకూరు పట్టణంలోని అన్ని ప్రైవేట్ ఎరువురు, పురుగుల మందుల దుకాణాలను వ్యవసాయ అధికారి రాము ఆధ్వర్యంలో కావలి సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడిఏ) డాక్టర్ సిహెచ్ నాగరాజు తనిఖీ చేశారు. ఎరువులు, మందులు కొనుగోలు చేసే రైతులకు బిల్లులను తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన తెలిపారు. ప్రైవేట్ డీలర్లు అందరూ షాపులు ముందు డీలర్ షాప్ పేరు, లైసెన్స్ నెంబర్, అడ్రస్ బోర్డు చూపించాలని షాపు ఓనర్లకు తెలియజేశారు.