రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని సచివాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రికి వినతిపత్రం రూపంలో అందజేశారు. అలాగే జిల్లాల విభజనలో భాగంగా కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపడం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని కోరారు.