వలేటివారిపాలెం మండలంలోని పుణ్యక్షేత్రం శ్రీ మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులు సమర్పించిన కానుకలు అన్నప్రసాదానికి రూ. 1, 52, 880, లడ్డు ప్రసాదానికి రూ. 1, 69, 090, తలనీలాలకు రూ. 32, 600, రూమ్ అద్దెలకు రూ. 32, 620, ప్రత్యేక దర్శనానికి రూ. 1, 92, 200, పలు పూజలకు రూ. 32, 630, మొత్తం రూ. 6, 25, 180 ఆదాయం వచ్చింది. కాగా ఇటీవల ఆలయ అభివృద్ది విషయమై ఎమ్మెల్యే ఆలయాన్ని సందర్శించారు.