ఉలవపాడు మండల వ్యవసాయ అధికారి బి. తిరుమల జ్యోతి, మండల ఉద్యాన శాఖ అధికారి జ్యోతి ఆధ్వర్యంలో ఉలవపాడు లోని సచివాలయంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు పంటలలోని చీడపురుగులు వాటి నివారణకు తీసుకోవాల్సిన సూచనలు చేశారు. మామిడి తోటల్లో నవంబర్ నెలలో తీసుకోవలసిన చర్యలు గురించి వివరించారు. రైతులు 30 శాతం పూత వచ్చిన తరువాత స్పైనోసాడ్ వెట్టబుల్ పిచికారి చేయాలని వివరించారు.