కలవల గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటూరి

85చూసినవారు
కలవల గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే ఇంటూరి
నెల్లూరు జిల్లా, వలేటివారి పాలెం కలవల గ్రామంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం పర్యటించారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల పంపిణీ చేశారు. గత వంద రోజులుగా కూటమి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేసిందని తెలిపారు. కందుకూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు.

సంబంధిత పోస్ట్