కందుకూరి పట్టణంలోని అంకమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు 12వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని కోరారు. నవరాత్రులు అన్ని రోజులు అభిషేకాలు, లలితా సహస్రనామ పారాయణం, పల్లకి సేవ ఉంటుందని తెలిపారు.