కందుకూరు పట్టణంలో పోలీసుల అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులు లతో పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీఆర్ బొమ్మ వరకు శుక్రవారం సంఘీభావ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారు అంటే పోలీసులు శాఖ ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. ప్రజల కోసం కుటుంబాలకు సైతం దూరంగా ఉంటున్నారని తెలిపారు.