నెల్లూరు జిల్లా ఉలవపాడులోని బంగారు షాపుల యజమానులతో ఎస్సై అంకమ్మ శనివారం సమావేశమయ్యారు. చుట్టుపక్కల పరిసరాలను కవర్ చేసే విధంగా బంగారు షాపుల ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే బంగారు షాపులకు లాకర్, అలారం సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏమైనా అనుమానిత వ్యక్తులు, అనుమాన సంఘటనలు జరిగినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.