అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని రాజుపాలెం జంక్షన్ దగ్గర సోమవారం అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ఇసుక టిప్పర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అంకమ్మ తెలిపారు. డ్రైవర్ల వద్ద ఎటువంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు చాలా తీవ్రతరంగా ఉంటాయన్నారు.