కావలి నియోజకవర్గం బోగోల్ మండలం కోళ్లదిన్నె గ్రామంలో వైసిపి, టిడిపి నాయకులు మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఈ గొడవలో గాయపడిన టిడిపి, వైసిపి నాయకులు కొందరు కావలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మళ్లీ అక్కడికి చేరుకున్న ఇరు వర్గాల నాయకులు భయంకరంగా కొట్టుకున్నారు. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ మధ్య సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.