మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం గ్రీవెన్స్ డే ఆర్జీల స్వీకరణ కార్యక్రమంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రతో పాటు రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం కావలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాలు గురించి రవిచంద్రతో చర్చించారు.