నెల్లూరు జిల్లా, కొండ బిట్రగుంటలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన మెట్ట, మాగాని భూములకు ఈనెల 30న కౌలు వేలంపాటి నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రాధాకృష్ణయ్య మంగళవారం తెలిపారు. మూడేళ్ల పాటు కౌలు ఇచ్చేలా వేలంపాట ఉంటుందని తెలిపారు. ఈనెల 30వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహణ ప్రారంభమవుతుందని ఆసక్తి గల రైతులు దేవస్థానంలోని ఈవో కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.