పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై కిరణ్ రిజిజు సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ చీఫ్ విప్ జైరామ్ రమేశ్ ఆరోపించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్‌కు కిరణ్ రిజిజుపై హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. తప్పుడు వ్యాఖ్యలు చేసిన రిజిజుపై చర్యలు తీసుకోవాలని కోరారు.