తెలుగుదేశంకు పార్టీ కార్యకర్తల పునాది అని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ లోని కనుపర్తిపాడు లోని విపిఆర్ కన్వెన్షన్ లో ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు.