ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి పార్టీ సభ్యత్వంలో కోవూరు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపి నాయకుల మధ్య సమన్వయం దిశగా కృషి చేయాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. కనుపర్తిపాడు లోని విపిఆర్ కన్వెన్షన్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు శిక్షణలో ఆదివారం పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పునాది అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.